గుణశేఖర్ కు సోషల్ సపోర్ట్..!

రీసెంట్ గా రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు రిలీజ్ కు ముందే ఏపి ప్రభుత్వం వినోదపుపన్ను రద్దు చేయగా ఆ విషయాన్ని గుర్తుచేస్తూ కాకతీయ సామ్రజ్య వీరవనిత రుద్రమదేవి చరిత్ర ఆధారంగా తను తీసిన రుద్రమదేవి సినిమాకు వినోదపుపన్ను ఇవ్వనందుకు ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఓ లేఖ రాశాడు గుణశేఖర్. అయితే దీనికి ఏపి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు కాని సోషల్ మీడియాలో మాత్రం గుణశేఖర్ కు సపోర్ట్ చేస్తూ మంచి పుష్ అప్ జరుగుతుంది.   

ఏకంగా #SupportRDforTaxExemptionInAP ట్యాగ్ తో గుణశేఖర్ కు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ప్రభుత్వం అన్ని సినిమాలను ఒకేలా చూడాలని పక్షపాతం లేకుండా ఉండాలని తన బాధనంతా తను రాసిన లేఖలో వెళ్లగక్కాడు దర్శక నిర్మాత గుణశేఖర్. అయితే ఈ విషయంపై ఎలాంటి స్పందన రాకపోయే సరికి నెటిజెన్లు దీని మీద ఇప్పుడు ట్రోలింగ్స్ చేస్తున్నారు. గుణ టీం వర్క్ కలిసి చేసిన రుద్రమదేవి సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా.. గుణశేఖర్ సినిమాను స్వయంగా నిర్మించారు. సినిమా కోసం ఎన్నో కష్టాలు పడ్డానని  గుణశేఖర్ చేసిన విన్నపానికి ఏపి సిఎం ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.