
మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీ ఎంట్రీ తర్వాత తన తర్వాత సినిమాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఖైది నంబర్ 150తో కలక్షన్స్ కుమ్మేసిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి కొత్త కథతో రాబోతున్నాడట. ఖైది హిట్ అయినా సరే కథ అరువు తెచ్చుకున్నారనే కామెంట్స్ బాగా వినిపించాయి. అయినా సరే ఖైది హిట్ మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.
ఇక ప్రస్తుతం 151వ సినిమా ప్రయత్నాల్లో ఉన్న మెగాస్టార్ బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడట. అయితే బోయపాటి బెల్లంకొండ శ్రీను సినిమాతో బిజీగా ఉండటంతో కాస్త టైం పట్టేట్టు ఉంది. ఈలోగా సురేందర్ రెడ్డితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సురేందర్ రెడ్డి కత్తి లాంటి కథ ఒకటి రెడీ చేశాడట. చిరుకి చూచాయగా చెప్పగా ఫుల్ వర్షన్ రెడీ చేయమన్నట్టు టాక్.
ఒకవేళ అది ఓకే అయితే కనుక సురేందర్ రెడ్డి డైరక్షన్లోనే చిరు 151వ మూవీ షురూ అయినట్టే. రేసుగుర్రం, ధ్రువ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి మెగా హీరోలకు మంచి సినిమాలను ఇస్తున్నాడు. సో మరి 150తో మళ్లీ మొదలుపెట్టిన మెగా ప్రభంజనం ఎలా కొనసాగుతుందో చూడాలి.