యాంకర్ శ్రీముఖిపై కన్నేశాడు..!

బుల్లితెర మీద తెగ హడావిడి చేస్తున్న శ్రీముఖి ఇప్పుడు వెండితెర మీద కూడా తన మెరుపులు మెరిపించాలని చూస్తుంది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా తర్వాత హీరోయిన్ గా అవకాశాలను అందుకోలేదు. ఇక ఈ గ్యాప్ లో స్మాల్ స్క్రీన్ పై తన హవా కొనసాగిస్తున్న అమ్మడిపై ఇనాళ్లు రచయితగా నటుడిగా ఉన్న హర్షవర్ధన్ తన డైరక్షన్లో చేస్తున్న సినిమాకు హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. 

80ల నాటి కథతో సాగే ఈ సినిమా టైటిల్ ను గుడ్..బ్యాడ్.. అగ్లీ అని పెట్టబోతున్నారట. మనం లాంటి సినిమాకు మాటలందించిన హర్షవర్ధన్ మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు అవుతాడని తెలుస్తుంది. మరి శ్రీముఖి వెండితెర ఆశలను హర్షవర్ధన్ అయినా సరే న్యాయం చేస్తాడో లేదో చూడాలి. ఇక ఇదే కాకుండా శ్రీముఖి బాలీవుడ్ హంటర్ రీమేక్ బాబు బాగా బిజీలో కూడా నటిస్తుంది. సో 2017లో సిల్వర్ స్క్రీన్ మీద కూడా శ్రీముఖి తన క్రేజ్ చూపించనుందని చెప్పొచ్చు.