శ్రీయకు మరో లక్కీ ఛాన్స్..!


సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పుడు శ్రీయ మంచి జోష్ లో ఉందని చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో వశిష్టదేవిగా నటించిన శ్రీయ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నది. ఆ పాత్రకు ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశారు అన్న దానికి తన నటనతో సమాధానం చెప్పింది శ్రీయ. అయితే బాలయ్య కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచిన ఈ వందవ సినిమా విజయంలో భాగమైన శ్రీయకు బాలయ్య మరో లక్కీ ఆఫర్ ఇచ్చాడు.  

తను తీసే తర్వాత కమర్షియల్ సినిమాలో కూడా హీరోయిన్ నువ్వే అన్నాడట బాలయ్య. శాతకర్ణి సినిమాకు బాలయ్య పెట్టిన ఎఫర్ట్ ఇప్పుడు ప్రేక్షకులు ఆ సినిమాకు ఇస్తున్న రెస్పాన్స్ కు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అందుకే ఈ సక్సెస్ లో కారణమైన శ్రీయకు మరో సినిమా ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం శాతకర్ణి సక్సెస్ మజా ఎంజాయ్ చేస్తున్న బాలకృష్ణ తన తర్వాత సినిమా ఎవరి దర్శకత్వంలో చేస్తాడో తెలియాల్సి ఉంది. అసలైతే కృష్ణవంశీ రైతు ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సింది. మరి అది ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. 

సీనియర్ హీరోల సరసన మనంలో నాగార్జునతో, గోపాల గోపాలలో వెంకటేష్ తో నటించి మెప్పించిన శ్రీయ ఎలాంటి పాత్రకైనా సరే తాను సిద్ధం అని తన ప్రతిభ చాటుకుంటుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన 15 సంవత్సరాలకు శ్రీయ ఇలాంటి గొప్ప ఆఫర్లు దక్కించుకుంటుంది అంటే కచ్చితంగా శ్రీయను మెచ్చుకుని తీరాల్సిందే. మొన్నామధ్య కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్నా దర్శకులు తన ప్రతిభకు తగ్గ పాత్రలనిస్తూ ఆమె సక్సెస్ లో భాగమవుతున్నారు.