
సౌత్ ఇండియన్ సూపర్ బ్యూటీ త్రిష కృష్ణన్ కు కూడా జల్లికట్టు ఎఫెక్ట్ పడింది. జల్లికట్టు మీద జరుగుతున్న రచ్చలో త్రిష దానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేసిందని ఆమె పట్ల తమిళనాడు ప్రజలు జల్లికట్టు అభిమానులు వివిధ రకాల నిరసనలు తెలియచేశారు. అంతేకాదు త్రిష మరణించినట్టు కూడా ఫోటో షాప్ పిక్చర్స్ పెట్టి మరి ట్విట్టర్ లో హల్ చల్ చేశారు. అంతటితో ఆగకుండా కొంతమంది బెదిరింపులు కూడా చేశారని తెలుస్తుంది.
అయితే పరిస్థితి మరి విషమించడంతో త్రిష మదర్ ఉమా కృష్ణన్ చెన్నై సిటీ పోలీస్ కమీషనర్ ను కలిశారు. పెటా సంస్థకు సహకరిస్తున్న త్రిష జల్లికట్టుకి సంబందించి వ్యతిరేకంగా ట్వీట్స్ చేయడంతో ఆమె గర్జనై సినిమా షూటింగ్ లో ఉండగా ఆమె మీద దాడికి దిగారు. ఈ విషయం పట్ల త్రిష మాత్రం విచిత్రంగా స్పందించింది. తాను తమిళియన్ నే.. తమిళ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తానని.. జల్లికట్టు మీద తను ఎలాంటి ట్వీట్ చేయలేదని అంటుంది. ఎవరో తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ చేసి ఆ ట్వీట్స్ చేశారని అన్నది. ఆందోళనలు కొనసాగుతాయని కమీషనర్ ను కలిసి త్రిషకు రక్షణ కల్పించాలని ఆమె మదర్ ఉమా కృష్ణన్ కోరుకున్నారు.