
అఆ హిట్ తో మళ్లీ సూపర్ ఫాంలోకి వచ్చిన నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి డైరక్షన్లో మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం పాత బస్తిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత షెడ్యూల్ అమెరికాకు షిఫ్ట్ అవుతుంది. ఇక సినిమాలో విలన్ గా క్రేజీ స్టార్ అర్జున్ నటిస్తున్నాడట. నితిన్, అర్జున్ డిఫరెంట్ కాంబినేషన్ తో వస్తున్న ఈ సినిమాతో డైరక్టర్ హను మ్యాజిక్ చేయనున్నాడట.
ఇక మొన్నటిదాకా యాక్షన్ హీరోగా ఉన్న అర్జున్ కాస్త గ్యాప్ ఇచ్చి నితిన్ సినిమాతో విలన్ గా కొత్త టర్న్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒకప్పటి హీరోలంతా విలన్స్ గా టర్న్ తీసుకుని సక్సెస్ ట్రాక్ లో ఉన్నారు. ఈ క్రమంలో అర్జున్ కూడా విలన్ గా మారాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న హను ఈ సినిమాను కూడా ప్రేమకథతోనే తెరకెక్కిస్తున్నాడట.
మరి నితిన్ కు విలన్ గా మారిన అర్జున్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ పూర్తి కాగానే అమెరికాలో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ నటిస్తుందని తెలుస్తుంది.