
మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఖైది నంబర్ 150 థియేటర్లలో వసూళ్ల హంగామా చేస్తుంటే సినిమాలో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడులో మెరుపులా కనిపించి అలరించిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. అయితే మెగాస్టార్ మెగా పవర్ స్టార్ ఇద్దరు అలా స్క్రీన్ మీద కనిపించడం ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇద్దరు కలిసి సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు.
అవును ఇది నిజమే.. ఇద్దరు మెగాస్టార్స్ కలిసి నటించిన ఓ 30 సెకన్ల సాంగ్ సూపర్ క్రేజ్ సంపాదించింది. ఈ లాజిక్ గమనించిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆ ఇద్దరిని కలిపి ఒకే సినిమాలో నటింపచేయాలని చూస్తున్నారు. అదే జరిగితే కనుక ఇక మరిన్ని రికార్డులు షురూ అవడం గ్యారెంటీ. లాస్ట్ ఇయర్ ధ్రువతో సూపర్ హిట్ అందుకున్న చెర్రి ఆ హిట్ మజా కంటిన్యూ చేసేలా మెగాస్టార్ ఖైది నంబర్ 150ని మెగా ఫ్యాన్స్ కు ఫీస్ట్ గా అందించాడు. ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా వస్తే కనుక రికార్డుల చెడుగుడు ఆడటం ఖాయం అని చెప్పొచ్చు. మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి.