సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా స్టిల్ ఒకటి మొన్న విడుదల చేశారు. సంక్రాంతి పండుగకి స్టిల్ రిలీజ్ చేయడం ఆనందమే కానీ దానిలో పవన్ కళ్యాణ్ కాడిపై (ఎద్దుల బండికి ఎద్దులను కట్టబడే అడ్డు కర్ర) ఒక కాలు వేసి చేతిలో తలపాగాతో కనిపిస్తాడు. ఎద్దులు మెడకు కట్టే ఆ కాడిని రైతులు చాలా పూజ్యనీయమైనదిగా భావిస్తారు. దానికి తమ పాదాలు కూడా తగులకుండా జాగ్రత్తపడుతుంటారు. అటువంటి కాడిపై పవన్ కళ్యాణ్ చెప్పు ధరించిన కాలును పెట్టి పోజు ఇవ్వడం పొరపాటే అని చెప్పవచ్చు. సాధారణంగా రైతులు అందరూ సంక్రాంతి పండుగ మూడవరోజైన కనుమ పండుగనాడు తమ ఆవులను, ఎద్దులను పూజిస్తారు. తెలిసి ఎన్నడూ పొరపాటు చేయని పవన్ కళ్యాణ్ సరిగ్గా ఆ సమయంలోనే ఇటువంటి స్టిల్ విడుదల చేయడం ఆశ్చర్యమే. దానిని ఉపసంహరించుకొంటే బాగుంటుంది.