
ఏంటి మెగాస్టార్ చిరంజీవి తర్వాత నానినా ఏ మిగతా హీరోలంతా లేరా ఏంటి అంటే.. ఇక్కడ ప్రస్థావించిన సందర్భం ఏంటంటే స్వశక్తితో పైకొచ్చిన వారిలో చిరంజీవి తర్వాత నానినే అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లతో పాటుగా కేవలం తన స్వయంకృషితోనే పైకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి సరసన నానిని చేర్చాడు. మాటల సందర్భంలో రవితేజ గురించి కూడా మాట్లాడాడు దిల్ రాజు.
ఎప్పటినుండో నానితో సినిమా తీద్దామనుకుంటున్న దిల్ రాజు ఈ సినిమాతో అది నెరవేరినందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చిరు తర్వాత నాచురల్ స్టార్ గా నాని ఇంత క్రేజ్ సంపాదించడం గొప్ప విషయమని అన్నారు. ఇక ఈ సంక్రాంతికి శతమానం భవతితో హిట్ అందుకున్న తన బ్యానర్లో వస్తున్న నాని 'నేను లోకల్' ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవడం గ్యారెంటీ అంటున్నాడు దిల్ రాజు.
బడా ప్రొడ్యూసర్ గా క్రేజీ సినిమాలు చేస్తూనే మరో పక్క కుర్ర హీరోలతో కూడా దిల్ రాజు వరుస సినిమాలను చేస్తున్నారు. మరి నానితో చేసిన ఈ మొదటి సినిమా నేను లోకల్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.