
ఈమధ్య మంచి ఫాంలో ఉన్న నాచురల్ స్టార్ నాని నుండి మరో సినిమా రాబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో నాని నక్కిన త్రినాధ రావు డైరక్షన్లో వస్తున్న సినిమా నేను లోకల్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. నాని హిట్ మేనియా కంటిన్యూ చేసేలానే ఉంది నేను లోకల్ ట్రైలర్ కూడా. చూస్తుంటే నానికి మరో సూపర్ హిట్ కన్ఫాం అన్నట్టు ఉంది.
లాస్ట్ ఇయర్ మూడు సినిమాలను రిలీజ్ చేసిన నాని మూడు సినిమాలను ఓకే ఫలితాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం రాబోతున్న నేను లోకల్ తో కూడా హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు లవర్ బోయ్ గా ఉన్న నాని ఈ సినిమాలో మాస్ యాంగిల్ ట్రై చేసినట్టు కనిపిస్తుంది. అటు లవర్ బోయ్ గా ఇటు మాస్ గాయ్ గా ట్రైలర్ తో సూపర్ ఇంప్రెషన్ కొట్టేశాడు నాని. మరి నాని హిట్ మేనియా ఈ సినిమా కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది చూడాలి.