
తెలుగు సినిమా మార్కెట్ ఓవర్సీస్ కలక్షన్స్ మీద ఆధారపడి ఉంది అన్నది వినిపిస్తున్న మాటే.. దానికి బలం చేకూరుస్తూ అక్కడ రిలీజ్ అయిన సినిమాల కలక్షన్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన రెండు భారీ సినిమాలు ఓవర్సీస్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేస్తున్నాయి. మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేసిన సినిమాగా ఖైది నంబర్ 150 ఓవర్సీస్ లో 200 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన ఖైది నంబర్ 150.. వీకెండ్ కు 2 మిలియన్ మార్క్ దాటేసింది. 9 ఏళ్ల తర్వాత కూడా మెగాస్టార్ సినిమాకు ఈ రేంజ్ కలక్షన్స్ ఉండటం మెగాస్టార్ స్టామినాను ప్రూవ్ చేస్తుంది.
ఇక నందమూరి నట సింహం బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఓవర్సీస్ లో కాసుల వర్షం కురిపిస్తుంది. 120 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు 3.5 లక్షల డాలర్లు వసూళు చేయగా శాతకర్ణి సినిమా ఫుల్ రన్ లో 1.5 మిలియన్ మార్క్ దాటేస్తుందని తెలుస్తుంది. బాలయ్య కెరియర్ లో లెజెండ్ సినిమా అత్యధికంగా 4.1 లక్షల డాలర్లు వసూలు చేయడం జరిగింది.
ఈ లెక్కలు చూస్తుంటే సంక్రాంతి సినిమాల హవా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఓ రేంజ్లో కొనసాగించాయని చెప్పొచ్చు. సీనియర్ హీరోల సినిమాల ఓవర్సీస్ కలక్షన్స్ చూసి ఇప్పటి స్టార్ హీరోలు కాస్త షాకింగ్ గా ఉన్నారని చెప్పొచ్చు.