పవర్ స్టార్ కూడా ఫిదా అయ్యాడట..!

మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేసిన ఖైది నంబర్ 150 మూవీకి మొదటి షో నుండి ఫ్యాన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఇన్నాళ్లు మెగా సినిమా కోసం వెయిట్ చేసిన ఫ్యాన్స్ అంతా మెగా మేనియా చూసి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో మెగాస్టార్ స్టామినా గురించి సినిమా చూసిన మెగా హీరోలు కూడా ట్వీట్స్ తో భలే హుశారు కలిగించారు. మరి ఇన్నేళ్ళ తర్వాత అన్నయ్య సినిమా తీస్తే తమ్ముడు పవర్ స్టార్ స్పందించలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. 

ఇక ఫిల్మ్ నగర్ వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈమధ్యనే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఖైది నంబర్ 150 మూవీ చూశాడట. సినిమా నిర్మాత చరణ్ పవర్ స్టార్ కోసం ప్రత్యేకంగా ఓ స్పెషల్ షో ఏర్పాటు చేయగా ఆ షో చూసిన పవర్ స్టార్ మెగాస్టార్ సినిమాను మెచ్చుకున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు సినిమా బాగా నచ్చేసిందట. ఇది ఎందుకు ఎనౌన్స్ చేయలేదో తెలియదు కాని పవన్ సినిమా చూసిన విషయం మాత్రం నిజమే అంటున్నారు.