
దర్శకధీరుడు రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం.. ఓటమి ఎరుగని దర్శకుడిగా తన ప్రతిభ చాటుతూ బాహుబలితో ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా స్థాయిని తెలియచేసిన రాజమౌళికి షాక్ ఇస్తూ మలయాళ పరిశ్రమ రంధమూలం అనే సినిమా చేస్తుంది. మహాభారతంలోని కొన్ని పర్యాయాలను తీసుకుని వాసుదేవన్ రచించిన నవల పేరు రంధమూలం. అయితే ఇప్పుడు అదే కథ సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక సినిమా బడ్జెట్ కూడా 600 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. భారతీయ సినిమా చరిత్రలో అంత బడ్జెట్ తో సినిమా అంటే కచ్చితంగా రికార్డే అని చెప్పాలి. నవల మొత్తం భీమసేనుడి పాత్ర ప్రధానంగా సాగుతుంది. ఈ పాత్రలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా చేయాలన్న ఆలోచన ఎన్నాళ్లనుండో ఉన్నా అది ఇప్పటికి కుదిరిందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో భీష్ముడిగా అమితాబ్, ద్రౌపదిగా ఐశ్వర్య రాయ్, అర్జునుడిగా విక్రం నటిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు నాగార్జున కూడా సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోశిస్తున్నారన్ టాక్. మలయాళ, తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతుందట. మరి తన కలల ప్రాజెక్ట్ గా రాజమౌళి మహాభారతం అనుకోగా ఆ కథనే చెప్పబోయే రంధమూలం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.