క్రిష్ తర్వాత మూవీ హీరో ఫిక్స్..!

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో దర్శకుడిగా సూపర్ అనిపించుకున్న క్రిష్ తన తర్వాత ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. ప్రస్తుతం శాతకర్ణి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న క్రిష్ ఆ తర్వాత సినిమాను విక్టరీ వెంకటేష్ తో తీసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే వెంకటేష్ తో కథా చర్చలు జరిపాడట. గురు తర్వాత పూరితో సినిమా ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్న వెంకటేష్ క్రిష్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలని చూస్తున్నాడట.

శాతకర్ణితో ఎలాగు పరిశ్రమ మెప్పు పొందిన క్రిష్ వెంకటేష్ కు సరిపోయే కథతో సినిమా చేయబోతున్నాడట. అయితే ఇది వెంకటేష్ 75వ సినిమా కాబట్టి ప్రెస్టిజియస్ గా ఉండబోతుందని సమాచారం. గమ్యం నుండి శాతకర్ణి వరకు దర్శకుడిగా తన బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్న క్రిష్ ప్రతి సినిమా ఓ అద్భుత కళాకండంగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి క్రిష్ మూవీతో వెంకటేష్ ఎలాంటి కథతో వస్తాడో చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో క్రిష్ సినిమా అన్న కూడా భారీ అంచనాలు ఏర్పడేలా చేసుకున్నాడు. ఆ అంచనాలతోనే క్రిష్ వెంకటేష్ మూవీ ఉంటుందో లేదో చూడాలి.