నందమూరి వారసుడి ఎంట్రీకి సిద్ధం..!

ఎన్టీఆర్ తర్వాత నందమూరి నట వారసత్వాన్ని తన భుజాల మీద వేసుకున్న బాలకృష్ణ 100వ సినిమా శాతకర్ణితో తన సత్తా చాటాడు. అయితే ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం, తారకరత్న హీరోలుగా రాగా ఇప్పుడు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్ధం అవుతుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించిన చర్చలు నడుస్తున్నా సరే ఏది ఫైనల్ అవలేదు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి సినిమా కన్ఫాం అయ్యిందని అంటున్నారు. 

బాలకృష్ణతో లెజెండ్ లాంటి సినిమాను నిర్మించిన వారాహి చలన చిత్ర అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞ మొదటి సినిమా నిర్మిస్తారట. ఈ విషయం తానే స్వయంగా వెళ్లడించడం జరిగింది. ఇక ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు. కనీసం ఎవరి డైరక్షన్ లో చేసే అవకాశాలున్నాయని కూడా చెప్పలేదు. నిర్మాత తానే ప్రస్తుతం కథల చర్చలు జరుగుతున్నాయి.. కథ ఓకే అయిన తర్వాత మిగతా విషయాలను ఎనౌన్స్ చేస్తామని అన్నారు. శాతకర్ణి సినిమాను కూడా కొన్ని ఏరియాల్లో భారీ మొత్తానికి కొనేసిన సాయి కొర్రపాటి సినిమా హిట్ టాక్ రావడంతో ఆనందంలో ఉన్నారు.