
నందమూరి నట సింహం బాలకృష్ణ 100వ సినిమాగా ఎవరు ఊహించని విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో నటించారు. విలక్షణ దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలయ్య పడిన కష్టం తెరమీద కనిపిస్తుంది. వందవ సినిమా చరిత్రలో మిగిలిపోయేలా ఉండాలనుకున్న బాలకృష్ణ కల నెరవేరిందని చెప్పొచ్చు. క్రిష్ దర్శకత్వ ప్రతిభ సాయి మాధవ్ బుర్ర మాటల పనితనం ఈరోజు రిలీజ్ అయిన శాతకర్ణి సినిమాకు ప్రతి తెలుగు హృదయం నీరాజనాలు పలికిస్తుంది.
వందవ సినిమా ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండాలనుకున్నాడో ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా శాతకర్ణి సినిమాలో నటించి మెప్పించాడు బాలయ్య బాబు. పాత్ర దాని తీరు తెన్నులే కాదు శాతకర్ణిగా బాలయ్య మరో మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు. ఇప్పటిదాకా బాలయ్యను ఎన్నో కోణాల్లో చూశాం కాని శాతకర్ణి మాత్రం నిజంగా అభిమానులకు ఓ అద్భుత కళాకండం అని అంటున్నారు. సినిమా మొదలైన నాటి నుండి రిలీజ్ వరకు ఎంతో శ్రమించిన దర్శకుడితో పాటు హీరో బాలకృష్ణ కూడా క్రిష్ వెంట ఉన్నాడు. అందుకే ఇవాళ ఈ సినిమా ప్రతి తెలుగు మనసుని కదిలిస్తుంది. తెలుగు జాతి గర్వపడే శాతకర్ణి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన క్రిష్ బాలయ్యలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.