
మెగాస్టార్ నటించిన ఖైది నంబర్ 150 మూవీ రిలీజ్ అయిన మొదటిరోజే సంచలన విజయం అందుకుంది. పదేళ్ల తర్వాత మెగాస్టార్ ను తెర మీద చూసిన ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే చిరంజీవికిది గ్రాండ్ కం బ్యాక్ అన్నట్టే. అయితే సోలో సినిమా తీసి పదేళ్లవుతున్నా మెగా ఫాలోయింగ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదని చెప్పొచ్చు.
ఈ ఫాలోయింగే మొదటి రోజు బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసింది. బాహుబలి సినిమా మొదటి రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో కలుపుకుని 22.4 కోట్ల కలక్షన్స్ వసూళు చేయగా.. ఖైది నంబర్ 150 మూవీ తొలిరోజు 23.24 కోట్ల కలక్షన్స్ వసూలు చేయడం జరిగింది. ఇది చాలు మెగాస్టార్ స్టామినా చెప్పడానికి. ఓ విధంగా పదేళ్ల గ్యాప్ తో మొదటిరోజు ఇంత భారీ కలక్షన్స్ రాబట్టడం అది కేవలం మెగాస్టార్ వల్లే అయ్యిందని చెప్పొచ్చు.