
మురుగదాస్ తీసిన కత్తి సినిమానే మెగాస్టార్ ఖైది నంబర్ 150గా రీమేక్ చేశారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా మొత్తం యాజిటీజ్ దించేసిన వినాయక్ కత్తి శ్రీను క్యారక్టర్ ను కాస్త మాస్ అభిమానులకు దగ్గర చేసే ప్రయత్నంలో మందు కొట్టే సీన్స్ పెట్టారు. చిరంజీవి, ఆలి మందు సీన్స్ మురుగదాస్ ను ఆశ్చర్యపరచాయట. ఈ సీన్స్ పై కాస్త అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది.
ఇక ఆలి కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేదని కొందరు అంటున్నారు. ముఖ్యంగా ఆలి వేసిన లేడీ గెటప్.. బ్రహ్మానందంను ఇరికించే సీన్స్ ఇవన్ని కేవలం తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి మాత్రమే చేశారు. చిరు మార్క్ కామెడీ యాంగిల్ మిక్స్ చేసి ఈ సీన్స్ థియేటర్ లో నవ్వులు పండించేలా చేసినా సరే తమిళంలో ఇవేమి లేకుండా సినిమా హిట్ చేసుకున్నారు. ఇక చిరు డ్యుయల్ రోల్ సీన్స్ కూడా అంత ఇంపాక్ట్ కలుగలేదు అన్నది ఓపెన్ టాక్. బాస్ సినిమా కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ కు నచ్చేసింది. కాని సాధారణ ఆడియెన్స్ కు మాత్రం మాములుగానే అనిపిస్తుంది.