ఇంప్రెసివ్ ఘాజి ట్రైలర్

బాహుబలి సినిమాతో దేశమంతా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రానా ఇప్పుడు మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ తో ముందుకొస్తున్నారు. సంకల్ప్ డైరక్షన్లో ఘాజి మూవీతో రాబోతున్న రానా 1971 నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కింది. విశాఖ తీరంలోని ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ ను కొలాప్స్ చేయాలని ఘాజి సబ్ మెరైన్ ను పంపించారు. అయితే దాన్ని నౌకా సిబ్బంది ఎలా ఢీ కొట్టారో ఈ ఘాజి సినిమాతో చెప్పనున్నారు.

నావీ ఆఫీసర్ గా రానా కనిపిస్తున్నాడు. రానా ఇంటెన్స్ ఘాజి ట్రైలర్ ఇంప్రెస్ చేసేసింది. ఆర్మీ, నావీ ఆఫీసర్స్ అప్పుడు ఎలా పనిచేశారు అన్న కథాంశంతో ఈ చిత్రం రాబోతుంది. ఇప్పటికే బాహుబలి పార్ట్-2 తో మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అయిన రానా ఘాజితో తెలుగు తమిళ హింది భాషల్లో తన ప్రతిభ చాటనున్నాడు. ట్రైలర్ అయితే వారెవా అనిపించేలా చేసింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ పై సిని ప్రముఖులంతా తమ స్పందన తెలియచేశారు.