
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను మొదట చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ కు చెందిన బెంగుళూరు ఫ్యాన్స్ ఒక్కో టికెట్ ను 12 లక్షలకు కొన్నారని తెలుస్తుంది. 3 టికెట్స్ 36 లక్షలకు కొనేశారట. మరి మెగా స్టామినా ఏంటో చెప్పడానికి ఈ టికెట్ ప్రైజ్ చూసి చెప్పేయొచ్చు. వేలం పాటగా సాగిన ఈ 3 టికెట్స్ తో వచ్చిన పెద్ద మొత్తాన్ని స్వచ్చంద సంస్థకు ఇచ్చేలా ప్రోగ్రాం ప్లాన్ చేశారు.
సో మొత్తానికి పదేళ్ల నిరీక్షణ ఈరోజుకి ఫలించింది. ఇక సినిమా టాక్ ఆల్రెడీ బయటకు వచ్చి సినిమా సూపర్ హిట్ అన్న టాక్ వచ్చేసింది. మెగాస్టార్ ను ఇన్నేళ్లుగా మిస్ అయిన ఫ్యాన్స్ అంతా మొదటిరోజే చిరంజీవి సినిమా చూసేయాలని తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే మొదటిరోజు భారీ కలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వినాయక్ డైరక్షన్లో వచ్చిన ఈ ఖైది నంబర్ 150లో చిరు స్టామినా కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన డ్యాన్స్ స్టైల్ లో ఏమాత్రం తగ్గినట్టు కనిపించని మెగాస్టార్ ఇక నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను సరిచేస్తాడనడంలో సందేహం లేదు.