యూఎస్ లో దుమ్మురేపుతున్న ఖైది..!

ఓ సినిమా టోటల్ కలక్షన్స్ లో ఓవర్సీస్ లో 1 మిలియన్ కలక్షన్స్ రాబట్టాలనుకుంటారు. కాని మెగాస్టార్ ఖైది నంబర్ 150 మూవీ మాత్రం కేవలం ప్రీమియర్స్ తోనే ఆ ఫీట్ సాధించేసింది. మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేసిన సినిమాగా ఖైది నంబర్ 150 మీద భారీ అంచనాలు పెరిగాయి. ఇక మెగాస్టార్ లోని మాస్ తో పాటు అభిమానులు మెచ్చే అన్ని కోణాల్లో అద్భుతంగా ఆయన్ను ప్రెజెంట్ చేసి వారెవా అనిపించాడు వినాయక్.

కత్తి రీమేక్ అయినా మెగా మేనియాతో ఖైది నంబర్ 150 మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మెగాస్టార్ స్టామినా ఏంటో యూఎస్ కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. కేవలం ప్రీమియర్ షోల మీదే 1 మిలియన్ మార్క్ కలెక్ట్ చేయగా ఇక టోటల్ రన్ లో ఖైది సంచలన రికార్డులు సొంతం చేసుకుంటుందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా యూఎస్ లో బాహుబలి మాత్రమే ప్రీమియర్స్ తో 1.3 మిలియ కలక్షన్స్ తో ముందంజలో ఉంది. మరి టోటల్ ప్రీమియర్స్ కౌంట్ చేస్తే ఖైది బాహుబలిని బీట్ చేసేట్టుగానే ఉన్నాడు.