
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడం స్టార్ట్ చేయగానే ఆయన్ను సినిమా హీరోగా అభిమానించే వారంతా మళ్లీ ఆయన గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ఇక ప్రస్తుతం అటు రాజకీయాల్లో ఉంటూ స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ లపై తనదైన ముద్ర వేసుకున్న రోజా కూడా చిరుతో మాటలు కలిపింది. అదేంటి రోజా చిరుతో మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవిని ఘోరంగా ఆడుకున్న రోజా ఇప్పుడు చిరుతో చిట్ చాట్ చేయడం ఏంటి అంటే.. సినిమాకు రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి ఓ ప్రముఖ చానెల్ వారు చిరు ఖైది నంబర్ 150 ప్రమోషన్స్ కోసం రోజా చేత ఇంటర్వ్యూ చేయించేలా ప్లాన్ చేశారు.
చిరంజీవి, రోజాలు కూడా మూడు సినిమాల్లో జతకట్టారు. సో మరోసారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాస్ కు గ్రాండ్ వెల్ కం చెబుతూ సినిమాకు సంబందించిన విషయాలను అడిగి తెలుసుకుంది రోజా. రోజా హోస్ట్ గా జరిపిన ఈ కార్యక్రమం త్వరలో ప్రసారం కానుందట. ఇక మెగాస్టార్ నటించిన ఖైది నంబర్ 150 తెల్లారితే థియేటర్లలో సందడి చేయనుంది. బాస్ ను మళ్లీ వెండితెర మీద చూడాలనుకున్న ఆయన అభిమానులంతా ఈరోజు కోసమే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. మరి వారిని ఉత్సాహ పరచేలా సినిమా ఉంటుందో లేదో చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.