బాలయ్య నోట ఖైది మాట..!

పైకి రెండు సినిమాల మధ్య పోటీ అంటూ కామెంట్లు వస్తున్నా సరే ఇద్దరు హీరోలు మాత్రం తమ సినిమానే కాదు పోటీ పడుతున్న తోటి హీరో సినిమా కూడా హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. జనవరి 11న ఖైది నంబర్ 150గా చిరంజీవి 9 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై రానున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని అన్నారు.

ఇక శాతకర్ణి ప్రమోషన్స్ లో పాల్గొన్న బాలయ్య కూడా నాకు వందవ సినిమా ఎంత ప్రత్యేకమో.. చిరంజీవికి ఖైది నంబర్ 150 అంత ప్రత్యేకం. కాబట్టి ఆ సినిమా కూడా ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఇక సినిమాల మధ్య పోటీ ఇప్పుడు కొత్తేం కాదని.. ఎప్పటి నుండో ఇలాంటి పోటీ వాతావరణం కొనసాగుతుందని అన్నారు బాలయ్య.

మరి హీరోలకి లేని గొడవ ఫ్యాన్స్ కు ఎందుకు చెప్పండి. ఎంచక్కా ఏ హీరో అభిమాని ఆ హీరో సినిమా చూసి తన అభిమాన నటుడి సినిమా హిట్ చేసేస్తే పోలా.. సగటు సిని ప్రేక్షకుడు మాత్రం రెండు సినిమాల మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి కాబట్టి రెండిటిని ఓసారి చూసేద్దాం అనుకుంటాడు.