
టాలీవుడ్ లో సూపర్ సెసేషనల్ డైరక్టర్ రాం గోపాల్ వర్మ.. సమయం దొరికితే చాలు మెగాస్టార్ ను టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం.. అసలు ఎందుకు మెగాస్టార్ అంటే వర్మకు అంత మంట అనేది ఎవరికి తెలియదు. మెగాస్టార్ ఫ్యాన్ ను అని చెప్పుకుంటూ ఆ హీరో మీదే భయకరమైన ట్వీట్స్ చేయడం కాస్త ఇబ్బందికరంగా మారాయి. అయితే అసలు వర్మ మెగాస్టార్ కు మధ్య డిస్టబెన్స్ రాడానికి కారణం, ఎప్పుడో ఇద్దరు కలిసి చేయాల్సిన సినిమా ఆగిపోవడం అని అంటుంటారు.
నాగార్జునకు శివ, వెంకటేష్ కు క్షణ క్షణం హిట్ అందించిన వర్మతో చిరంజీవి కూడా ఓ సినిమా తీయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో వర్మ యాటిట్యూడ్ నచ్చక ఆ సినిమా నుండి చిరు వాకవుట్ చేశాడని ఓ రూమర్ ఉండేది. కాని చిరు మాత్రం సంజయ్ దత్ సినిమా చేయాల్సి ఉండటంతో వర్మ తనంతట తాను ఆ సినిమా ఆపాడని చెప్పుకొచ్చాడు. మరి రెండిటిలో ఏది నిజమో తెలియదు కాని వర్మ మెగా ఫ్యామిలీ మధ్య జరుగుతున్న ఈ హాట్ హాట్ గొడవ చాలా విషయాలను బయట పడేలా చేస్తుంది.
అసలు వర్మ మెగాస్టార్ పై ఎందుకు కోపం పెంచుకున్నాడు. ఇన్ని ట్వీట్స్ చేస్తున్నా మెగాస్టార్ ఎందుకు వర్మని ఏమి అనట్లేదు అన్నది అభిమానులకు అర్ధం కావట్లేదు. నాగబాబు విషయం పట్ల అదే రేంజ్ లో ఘాటుగా స్పందించిన వర్మ చివరకు చిరంజీవి గారు నాగబాబు తగ్గకపోతే అసలు విషయం బయట పెడతా అని ట్వీట్ చేశాడు. వర్మ చిరుకి సందించిన ఆ అసలు విషయం ఏంటి అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈ గొడవకు ఎప్పుడు ముగింపు దొరుకుతుందో చూడాలి.