విష్ణుకి మోహన్ బాబు వార్నింగ్..!

మంచు మోహన్ బాబు తప్పు ఎవరు చేసినా సరే మొహమాటం లేకుండా కడిగేయడం మాములే. తప్పు తన వాళ్లు చేసినా సరే క్షమించేది లేదు అని చెప్పే కలక్షన్ కింగ్ నిన్న జరిగిన లక్కున్నోడు ఆడియో రిలీజ్ వేదికపై మంచు విష్ణుకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ మోహన్ బాబు ఎందుకు విష్ణుని టార్గెట్ చేశాడు అంటే.. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో తాను తన సినిమాల ఆడియో వేడుకలకే వెళ్లనని నోరు జారాడట. అది గమనించిన మోహన్ బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దని.. నీ సినిమా ఆడియోకి నువ్వు వెళ్లకపోవడం ఏంటని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు.

వేరే హీరోల్లా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దని చెబుతూ సిన్సియర్ గా ఉంటే అన్ని ఉంటాయి. డబ్బాలు మనకు వద్దు అని విష్ణుకి క్లాస్ పీకాడు. ఇక లక్కున్నోడు సినిమా చిత్రయూనిట్ అందరికి తన విశెష్ తెలిపిన మోహన్ బాబు సినిమా దర్శక నిర్మాతలు సినిమా కోసం చాలా కష్టపడ్డారని అన్నారు. సో ఇన్నాళ్లు కేవలం బయట వాళ్లనే టార్గెట్ చేసే మోహన్ బాబు తప్పు తన కొడుకులు చేసినా ఊరుకోరు అని మంచు విష్ణుకి ఇచ్చిన వార్నింగ్ ద్వాతా తెలుసుకోవచ్చు.