ఖైది నంబర్ 150లో బన్ని కూడా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా ఖైది నంబర్ 150 మూవీలో మెగా హీరోల స్పెషల్ అప్పియరెన్స్ గురించి తెలిసిందే. అయితే కేవలం సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ మాత్రమే అది కూడా 30 సెకన్లే ఉంటారని అన్నారు. ఆ విషయం చెర్రినే బయట పెట్టాడు.. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కనిపిస్తాడని ఎక్స్ క్లూజివ్ టాక్. 

మెగా హీరోగా అల్లు అర్జున్ స్టామినా సినిమా సినిమాకు ఓ రేంజ్లో పెంచుకుంటూ వచ్చాడు. చెర్రి తర్వాత మెగా పవర్ ను కొనసాగిస్తున్న బన్ని కూడా కనిపిస్తాడట. మరి ఒకే ఫ్రేంలో బన్ని, చెర్రి, మెగాస్టార్ కనిపిస్తారా లేక వేరు వేరుగా అన్నది తెలియదు కాని మొత్తానికి మెగాస్టార్ సినిమాకు తన సపోర్ట్ కూడా అందించాడు అల్లు అర్జున్. మెగాస్టార్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న బన్ని మామ కోసం ఆమాత్రం చేయకపోతే ఎలా చెప్పండి.

మొన్నటిదాకా చెర్రి మాత్రమే చిన్న డ్యాన్స్ బిట్ అన్నారు.. ఇప్పుడు బన్ని కూడా అంటున్నారు.. సినిమాలో సర్ ప్రైజ్ గా వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లు కూడా కనిపిస్తారేమో చూడాలి. అదే కనుక జరిగితే మెగాస్టార్ తో పాటుగా మెగా హీరోలందరు కలిసి ఫ్యాన్స్ కు విందు భోజనం అందించినట్టే. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.