
రోజుకో సంచలన స్టేట్మెంట్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ఆర్జివి. తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా దర్శకుడు క్రిష్ కు ఓ సలహా ఇచ్చాడు. ఇప్పటికే ముంబైలో శాతకర్ణి సినిమా ఓ పెద్ద కార్పోరేట్ సంస్థ చూసి ఓవర్సీస్ ఇంటర్నేషనల్ రైట్స్ తీసుకున్నదని వెళ్లడించిన వర్మ ఆ క్రమంలో ఎస్.కె, ఏ.కె లతో సినిమాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడని అన్నారు. ఇంకా వేరే రెండు పెద్ద కంపెనీల ప్రాజెక్టులకు క్రిష్ సైన్ చేస్తున్నాడని తెలియచేశాడు.
అయితే ఇక్కడ వర్మ ప్రస్థావించింది షారుఖ్, అమీర్ ఖాన్ లని తెలుస్తుంది. ఇప్పటికే క్రిష్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో హాలీడే సినిమా తీశాడు. అయితే ఈసారి తన కథతో షారుఖ్, అమీర్ లను డైరెక్ట్ చేయనున్నాడట. బాలకృష్ణ వందవ సినిమాను అంతే ప్రతిష్టాత్మకంగా తీసిన క్రిష్ ఆ సినిమాతో ఎన్నో గొప్ప ఆఫర్లు అందిపుచ్చుకుంటున్నాడు. మరి క్రిష్ కు వర్మ ఇచ్చిన సలహా పాటిస్తాడా లేడా అన్నది వేచి చూడాలి.
రీసెంట్ గా చిరు ఖైది నంబర్ 150 ఈవెంట్ లో తన మీద నాగబాబు వేసిన పంచ్ లకు అదే రేంజ్ రివెంజ్ తీర్చుకున్న వర్మ.. నాగబాబు సైలెంట్ అయ్యాడేంటో అంటూ మళ్లీ ట్వీట్ చేయడం విశేషం. ఇక నిన్న అలా హాట్ ట్వీట్ ఫైట్ తర్వాత తను హీరోగా రౌడి నంబర్ 150 పోస్టర్స్ ను రిలీజ్ చేసి సంచలనంగా మారాడు ఆర్జివి.