దర్శకేంద్రుడు గురించి బాంబ్ పేల్చిన నాగార్జున..!

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెలుగు పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలను అందించారు. ప్రస్తుతం భక్తి రస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రాఘవేంద్ర రావు చివరి సినిమా ఓం నమో వెంకటేశాయ అని అంటున్నారు కింగ్ నాగార్జున. ఇద్దరి కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి తర్వాత వస్తున్న ఓం నమో వెంకటేశాయ షూటింగ్లో తనతో చాలా సార్లు ఇది తన చివరి సినిమా అవుతుందని అన్నారని చెప్పారు నాగార్జున.

నిన్న జరిగిన ఓం నమో వెంకటేశాయ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో నాగార్జున ఈ విషయాన్ని వెళ్లడించారు. ఇక తనకు వెంకటేశ్వర స్వామితో ఉన్న అనుబధం గురించి చెబుతూ తనకు అడుగగానే అన్ని ఇచ్చిన ఆరాధ్యుడని అన్నారు. తన మదర్ తో మొదటిసారి తిరుపతి వెళ్లిన సందర్భాన్ని గుర్తుచేసుకున్న నాగార్జున ఆమె చివరి రోజుల్లో బాధను చూడలేక తీసుకెళ్లామని తాను అడిగానని కళ్లు చెమ్మగిల్లుతూ మాట్లాడారు. ఇక మనం కూడా నాన్న గారి చివరి సినిమా అని తెలిసి అది హిట్ చేయమని అడుగ్గా అది కూడా నెరవేర్చాడని అన్నారు. నాకు కావాల్సిన దాని కన్నా ఎక్కువ ఇచ్చిన స్వామికి నేను ఎప్పుడు థాంక్స్ చెబుతూనే వస్తున్నా అన్నారు నాగార్జున.