
సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మురుగదాస్ మూవీ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంది. ఇంతకీ ఏంటా న్యూస్ అంటే బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ సినిమా ఏప్రిల్ 14 అని ఆశ చూపారు. ఫ్యాన్స్ అంతా ఆ డేట్ కు రిలీజ్ కన్ఫాం అనుకున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ మురుగదాస్ సినిమా అనుకున్న టైం కు రిలీజ్ అవదట. దీనికి కారణం ఆరోజు తమిళ సంవత్సరాది కావడం చేత అజిత్ నటిస్తున్న సినిమా భారీగా రిలీజ్ చేస్తున్నారట.
మొదటిసారిగా తమిళంలో భారీగా రిలీజ్ ప్లాన్ చేసిన మహేష్ అజిత్ సినిమా ఎఫెక్ట్ పడుతుందని భావించి వెనుకడుగు వేస్తున్నాడట. ఇక ఏప్రిల్ లో అనుకున్న డేట్ మిస్ అయితే మళ్లీ సినిమా జూన్ లోనే రిలీజ్ అని అంటున్నారు. ఎందుకంటే మే లో రిలీజ్ అయిన మహేష్ సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఈసారి మే సెంటిమెంట్ బలంగా నమ్ముతున్న మహేష్ సినిమా ఫైనల్ గా జూన్ కు పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.
ఏప్రిల్ ఎండింగ్ లో బాహుబలి పార్ట్-2 కూడా వచ్చే అవకాశాలుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.