
మెగాస్టార్ నటించిన ఖైది నంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా జరుగనుంది. అయితే ఈ ఈవెంట్ కు మెగా హీరోలందరితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తాడన్న వార్త కొద్దిరోజులుగా హల్ చల్ చేస్తుంది. పవర్ స్టార్ తో కూడిన మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేంలో కనిపించనున్నారని అభిమానులు తెగ ఖుషి అయ్యారు. ఇక ఓ పక్క పవన్ రావడం ఓ రూమరే అంటూ వార్తలొస్తున్నా ఎలాగైనా పవర్ స్టార్ ను రప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది.
అయితే కొద్ది గంటల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ఖైది యూనిట్ ను విష్ చేశారు. చరణ్ వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న మొదటి చిత్రమే చిరంజీవి గారి 150వ సినిమా కావడం తనకు ఆనందంగా ఉందంటూ.. ఖైది నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నానని.. ఈ సినిమాలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు నా మనః పూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
సో ఈ మ్యాటర్ చూస్తుంటే తను ఎలాగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావట్లేదు అన్న విషయం చెప్పినట్టు తెలుస్తుంది. అన్నయ్య పిలిస్తే రాడని వదినతో కూడా ఓ మాట చెప్పించినా సరే పవర్ స్టార్ ఈ ఈవెంట్ కు అటెండ్ అవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ రాకుండా ఉంటేనే తన ఫ్యాన్స్ కాస్త కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని అందుకే కావాలని పవర్ స్టార్ రాకపై అంత ఇంట్రెస్ట్ చూపించలేదని అంటున్నారు వారు ఉన్నారు. ఇక ఈ ట్వీట్ కూడా విషయం ముందే చెప్పేస్తే ఎ గోల ఉండదని పెట్టినట్టు టాక్. మరి ఏది నిజమో తెలియదు కాని పవర్ స్టార్ మాత్రం ఖైది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావట్లేదు అన్నది కచ్చితంగా అర్ధమయ్యింది.