
తెలుగులో చారిత్రాత్మక సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వ తరపున ఆ సినిమాకు వినోదపు పన్ను రద్దు చేయడం ఆనవాయితి. ఇక తెలుగు రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత శాతకర్ణి సినిమా రాబోతుండగా పెద్ద మనసుతో తెలంగాణ సిఎం కెసిఆర్ఆ సినిమాకు వినోదపు పన్నుని ఎత్తేశారు. అసలే బాలకృష్ణ సినిమా ఇక ఏపిలో ఉంది కూడా వారి ప్రభుత్వమే కాబట్టి అక్కడ వినోదపు పన్ను రద్దు చేసే అవకాశం ఉంది.
అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వకుండా శాతకర్ణికి ఇవ్వడంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడి యొక్క ఉద్దేశం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఓరుగల్లు వీర నారి రుద్రమదేవి అది కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా అష్ట కష్టాలు పడి సినిమా తీసిన గుణశేఖర్ కు తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయించింది కాని ఏప్రి ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. మరి బాబు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించారో ఆయనకే తెలియాలి. అయితే ఈ విషయం ఏమి అంతగా పట్టించుకోని కెసిఆర్ శాతకర్ణి మూవీకి కావాల్సిన సహకారం అందించారు.