ఖైది, శాతకర్ణిలను టార్గెట్ చేసిన పీపుల్ స్టార్..!

పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి హీరోగా చదలవాడ శ్రీనివాస్ దర్శక నిర్మాణంలో వస్తున్న సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్న తరుణంలో సినిమాకు థియేటర్లు ఇవ్వట్లేదని పెద్ద సినిమాల మీద తన ప్రతాపం చూపించాడు నారాయణ మూర్తి. మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150, యువరత్న బాలకృష్ణ శాతకర్ణి సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో తన సినిమాకు థియేటర్లు లేకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యాడు నారాయణ మూర్తి.    

అంతేకాదు కేవలం పెద్ద సినిమాలే రిలీజ్ అయితే ఇండస్ట్రీ ఏమవుతుంది. చిన్న సినిమాలకు ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలని అన్నారు. ఇక ఊళ్లో ఉన్న అన్ని థియేటర్లు పెద్ద సినిమాలు ఆక్యుపై చేసే తన లాంటి చిన్న సినిమాలు తీసే వారు ఎలా రిలీజ్ చేస్తారని అన్నారు మూర్తి గారు. మేమేం అన్నీ థియేటర్లు కావాలని అడగట్లేదని కేవలం ఊరికి ఒక థియేటర్ అయినా సరే ఇస్తే చాలని అన్నరు నారాయణ మూర్తి. పీపుల్ స్టార్ గా ప్రజలను చైతన్యపరిచే సినిమాలను తీస్తూ వచ్చే ఆర్. నారాయణ మూర్తి చాలా రోజుల తర్వాత బయట ప్రొడక్షన్ లో ఈ సినిమా చేశారు. సినిమాలో ఆయకు జతగా సహజనటి జయసుధ నటించడం జరిగింది.