శాతకర్ణి గురించి చిరు కామెంట్..!

ఈ సంక్రాంతి పండుగకి రిలీజ్ అవుతున్న రెండు భారీ సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అటు చిరు ఇటు బాలయ్య ఇద్దరికి 100, 150వ సినిమాగా ఎంతో క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే ఈ విషయం పట్ల చిరంజీవిని అడిగితే మాత్రం పోటీ ఉందన్న మాట వాస్తవమే కాని అదేదో అనుకుని చేస్తుంది కాదు. బాలకృష్ణ సినిమా కూడా బాగా ఆడాలి. శాతకర్ణి సినిమా ఓపెనింగ్ రోజున నేను వెళ్లా.. కెమెరా స్విచాన్ చేసింది నేనే.. అలాంటి కథ ఎంచుకున్నప్పుడే సగం సక్సెస్ అయ్యాడు బాలకృష్ణ అనంటున్నారు చిరు. 

ఇక నాకు పోటీ అని ఎప్పుడు అనుకోలేదు. పండుగకి రిలీజ్ అయ్యే ఈ రెండు సినిమాలే కాదు మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా అన్నారు మెగాస్టార్. సంక్రాంతి సందర్భంగా ఈ పండుగకి 11, 12, 14 వరుసగా నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 11న ఖైది నెంబర్ 150 రిలీజ్ అవుతుండగా.. 12న గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అవుతుంది. ఇక 14న శర్వానంద్ శతమానం భవతితో పాటుగా ఆర్.నారాయణ మూర్తి నటిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా రిలీజ్ అవుతుంది.