
కింగ్ నాగార్జునకు పోటీగా తనయులిద్దరు ఈ ఇయర్ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక లాస్ట్ ఇయర్ ప్రేమంతో హిట్ అందుకుని సాహసం శ్వాసగా సాగిపోతో పర్వాలేదు అనిపించుకున్న నాగ చైతన్య సోగ్గాడే చిన్ని నాయనా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. నిన్నె పెళ్లాడతా సినిమాలా ఉండబోతున్న ఈ కథకు టైటిల్ ఏం పెట్టాలా అన్న ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.
ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమా టైటిల్ 'అల్లరి అల్లుడు' అని పెట్టబోతున్నారట. నాగార్జున సూపర్ హిట్ మూవీస్ లో అల్లరి అల్లుడు కూడా ఒకటి. అత్త వాణిశ్రీని ఆటపట్టిస్తూ మీనా, నగ్మాలతో నాగ్ చేసిన రొమాన్స్ అదుర్స్ అనిపించింది. అయితే ఇప్పుడు అదే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టబోతున్నారట. మరి కథ మ్యాచ్ అయ్యి పెడుతున్నారో లేక టైటిల్ క్రేజీగా ఉండాలని నిర్ణయించారో తెలియదు కాని టైటిల్ ఎనౌన్స్ చేయడమే లేటని తెలుస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో మరోసారి సోగ్గాడి మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమా అన్నపూర్ణ బ్యానర్లోనే నిర్మితమవుతుంది. ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను అనుకున్నా నాగార్జున సలహా మేరకు ఆమెను కాదని రకుల్ ను సెలెక్ట్ చేశారట.