
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 మూవీ జనవరి 11న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు సాయంత్రం హాయ్ ల్యాండ్ లో జరుగనుంది. ఈవెంట్ కు చీఫ్ గెస్టులుగా దాసరి, రాఘవేంద్ర రావు వస్తారని తెలిసింది. అయితే వీరే కాకుండా మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి పవర్ పాక్డ్ హిట్స్ పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ కూడా వస్తారని ఎక్స్ క్లూజివ్ టాక్. కాని పవన్ కళ్యాణ్ వచ్చేది లేది కన్ఫాం చేసి చెప్పట్లేదు మెగా కాంపౌండ్.
ఒకవేళ వస్తాడని రాకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో అని అలా చేస్తున్నారట. ఖైది ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రెస్టిజియస్ గా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వస్తారని అంటున్నారు. అంతేకాదు మిగతా మెగా హీరోలంతా కూడా ఈవెంట్ లో భాగమవుతారట. అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ ఇలా మెగా హీరోలంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారట. పవన్ కళ్యాన్ మాత్రం చివరగా వచ్చి మాట్లాడతారని తెలుస్తుంది. సో మొత్తానికి మెగా హీరోలందరిని ఓకే స్టేజ్ మీద కనిపించనున్నారన్నమాట. ఇక ఈ వేడుక ఏర్పాట్లలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేకంగా చూస్తున్నారు.