
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో క్రిష్ కూడా ఎంతో ప్రతిభావంతమైన దర్శకుడని చెప్పొచ్చు. ఇక తను తీసిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మెగా చట్రంలో ఇరుక్కున్నాడని అంటున్నారు కొందరు. శాతకర్ణి ఆడియో ఖబడ్దార్ అన్న మాటకు మెగా ఫ్యాన్స్ నుండి నెగటివ్ కామెంట్స్ ఫేజ్ చేసిన క్రిష్ రిలీజ్ విషయంలో కూడా ఓకే రోజు రెండు సినిమాలైతే నష్టమని గ్రహించి తన సినిమాను 12 రిలీజ్ అని ఎనౌన్స్ చేశాడు. మెగా హీరోలందరు మంచి ఫాంలో ఉన్నారు ఇప్పుడేదో ఓ సినిమా గురించి వారితో కయ్యానికి దిగితే కచ్చితంగా ఫ్యూచర్లో ప్రాబ్లంలో పడాల్సి వస్తుంది. అందుకే క్రిష్ మెగా సినిమాకు దారి ఇవ్వక తప్పలేదు.
అయితే చిరుకి పోటీగా శాతకర్ణి కూడా 11నే రిలీజ్ చేయాలని నందమూరి కాంపౌండ్ ప్రయత్నాలు జరిపినా మెగా స్ట్రోక్ ఒకసారి తగిలింది కాబట్టి జాగ్రత్త పడ్డాడు క్రిష్. శాలివాహన కాలం నాటి శాతకర్ణి కథతో తెరకెక్కించ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలకృష్ణకు చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పాలి. ట్రైలర్ లోనే యుద్ధ సన్నివేశాలతో అంచనాలను పెంచేసిన క్రిష్ మరి సినిమా ఎలా తీశాడో అని అందరు చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.