
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం గౌతం మీనన్ డైరక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గౌతం మీనన్ అన్ని సినిమాల్లో లానే హీరో హీరోయిన్ మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. అయితే ధనుష్ ఇంతవరకు చాలా సినిమాలే చేసినా ముద్దు సీన్లలో మాత్రం నటించలేదు. అది కాక తన సహనటి కొత్త అమ్మాయి కావడంతో కాస్త బెరుకు చెందాడట. లిప్ లాక్ కోసం ఇబ్బంది పడుతున్న హీరోని చూసి హీరోయిన్ కాస్త చొరవ తీసుకుని తన పెదాలను అప్పగించిందట.
ఏమాయ చేసావే సినిమాలో నాగ చైతన్య, సమంతల లిప్ లాక్ సన్నివేశాలు తెలిసినవే. తన ప్రతి సినిమాలో కంటెంట్ తో పాటుగా ప్రేమికుల మధ్య ఉంటే ఆ సాన్నిహిత్యం చూపించే గౌతం మీనన్ ధనుష్ సినిమాలో కూడా లవ్ స్టోరీని పెడుతున్నాడట. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న ధనుష్ చేత లిప్ లాక్స్ చేయించిన డైరక్టర్ గౌతం మీనన్ సినిమా ఫలితం ఏ రేంజ్లో అందుకుంటాడో చూడాలి.
ఇక లాస్ట్ ఇయర్ తెలుగులో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా పర్వాలేదు అనిపించుకున్నా గౌతం మార్క్ మ్యాజిక్ మిస్ అయినట్టు అనిపించింది. మరి రాబోతున్న ధనుష్ సినిమాలో అయినా అది ఉండేలా జాగ్రత్తపడతాడేమో చూడాలి. ధనుష్ తో చేస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవనుందట.