పేరు మార్చుకుంటున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఈ వయసులో పేరు మార్చుకోవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. కాని తనని ఇక నుండి 'బసవ తారక రామపుత్ర' అని పిలవాలని అంటున్నాడు బాలయ్య. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో శాతకర్ణిగా నటించిన బాలకృష్ణ ఇక నుండి తన పేరు కూడా మార్చుకోనున్నాడట. ఇదంతా తన మీద ఆ సినిమా చూపించిన ప్రభావమని చెప్పొచ్చు. ఇక కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసి స్పెషల్ షోకి ఇన్వైట్ చేసిన బాలయ్యకు సినిమా మీద వినోదపు పన్ను ఎత్తేసి ప్రభుత్వం తరపున సహకారం అందించారు కెసిఆర్.  

ఇదే కాకుండా చరిత్ర కథతో ఏ సినిమా వచ్చినా సరే తమ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితి కలిగిస్తుందని అన్నారు. శాతకర్ణి ముహుర్తం రోజు కూడా సిఎం కెసిఆర్ తో క్లాప్ కొట్టించుకున్న బాలయ్య ఇప్పుడు స్పెషల్ షోకి ఆయన్ను ఆహ్వానించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వై.రాజీవ్ రెడ్డి, సాయి బాబు నిర్మించారు.