శాతకర్ణి సెన్సార్ రికార్డ్.. సింగిల్ కట్ కూడా లేదట

నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ తో అంచనాలను పెంచేసిన దర్శకుడు క్రిష్ సినిమా ఎలా తీసి ఉంటాడా అని ఫ్యాన్స్ అందరు ఎక్సయిట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న శాతకర్ణి సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. అంతేకాదు క్రిష్ తీసిన ఈ సినిమాకు సింగిల్ కట్ కూడా లేకుండా మొత్తం రెండు గంటల 15 నిమిషాలు సినిమా ఉంచారట.

సింగిల్ కట్ లేకుండా బాలయ్య సినిమా అంటే కచ్చితంగా రికార్డు అన్నట్టే. ప్రస్తుతం భారీ ప్రమోషన్స్ ప్లానింగ్ లో ఉన్న శాతకర్ణి మేకర్స్ 8న సినిమా రిలీజ్ అయ్యే 100 థియేటర్స్ లో శాతకర్ణి పతకాన్ని ఎగురవేస్తున్నారు. 55 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా బాలయ్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నారు. శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హేమ మాలిని గౌతమిగా నటించారు.