
డైరక్టర్ వినాయక్ ఏంటి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి జపం చేయడం ఏంటని కాస్త కన్ ఫ్యూజ్ అవ్వొచ్చు. టాలీవుడ్ లో జగన్ అనే డైరక్టర్ ఉన్నాడు కదండి అదేనండి పూరి జగన్నాథ్.. వినాయక్ ప్రస్థావించింది ఈ జగన్ గురించి అన్నమాట. టాలీవుడ్ టాప్ డైరక్టర్ లలో ఒకరైన వినాయక్ మరో టాప్ డైరక్టర్ వినాయక్ జపం చేయడం ఏంటంటే. జగన్ లా ఒకరోజు బ్రతికినా చాలు అంటున్నాడు వినాయక్. తనకు కాస్త బాధగా అనిపించినప్పుడు జగన్ కి ఫోన్ చేసి మాట్లాడతానంటున్న వినాయక్, ఎప్పుడు జగన్ సరదాగా ఉంటాడని అతనిలా వచ్చే జన్మలో అయినా పుట్టాలని అంటున్నాడు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి కామెంట్స్ వర్మ గురించి అందరు అంటుంటారు. కాని వినాయక్ మాత్రం వర్మ శిష్యుడు పూరి గురించి ఇలా అనడం కాస్త షాక్ అవుతున్నారు. రాజమౌళి, పూరిలతో తను కలిసినప్పుడు సరదాగా ఉంటుంది అంటున్న వినాయక్ రాజమౌళిని చూస్తే కొత్త ఉత్సాహం వస్తుందని ఇక పూరిలా ఉంటే చాలనిపిస్తుంది అన్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ ఖైది నంబర్ 150 మూవీ డైరెక్ట్ చేసిన వినాయక్ సినిమా రిజల్ట్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు.