
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు ఓం పురి ఈరోజు ఉదయం ముంబైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. రంగస్థల కళాకారుడి నుండి బాలీవుడ్ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఓం పురి మరణ వార్త బాలీవుడ్ ను షాక్ అయ్యేలా చేసింది. 1950 అక్టోబర్ 18న ఓ పంజాబి కుటుంబంలో జన్మించిన ఓం పురి పూణె ఫిల్మ్ ఇన్స్ ట్యూట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 1976 ఘాశీరామ్ కొత్వాల్ అనే మరాఠి సినిమాతో సిని రంగ ప్రవేశం చేశారు.
ఓం పురి తెలుగులో అకురం సినిమాలో నటించారు. కేవలం ఒక్క భాషలోనే సినిమాలని కాకుండా విభిన్న భాషల్లో నటించిన ఘనత ఓం పురికి చెందినది. ఎన్నోసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులను అందుకున్న ఓంపురి.. కెరియర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. 1990లో భారతా ప్రభుత్వ ఆయనకు పద్మశ్రీ ఇచ్చింది. 8 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకోవడమే కాదు అశేష ప్రేక్షకాభిమానం పొందిన నటుడిగా ఓం పురి భారతీయ సిని పరిశ్రమలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా నిలిచారు.