
2016 చివర్లో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. నారా రోహిత్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో శ్రీవిష్ణు అసలు హీరో అని అనాల్సిందే. అయితే ఈ కథ పట్టుకుని దాదాపు రెండు సంవత్సరాలుగా ఫిల్మ్ నగర్లో తిరిగారట దర్శకుడు సాగర్ చంద్ర, శ్రీవిష్ణులు. ఫైనల్ గా రోహిత్ కు కథ చెప్పడం ఆయనకు నచ్చడం జరిగింది. అయితే ఇక మీదట ఈ కథ పట్టుకుని ఎక్కడైనా కనిపించొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.
అంటే ఇక్కడ రోహిత్ ఉద్దేశం ఏంటంటే సినిమా మనం చేస్తున్నాం అంతే.. ఇక మీదుట మీకు ఈ కష్టాలు వద్దనేశాడట. కథ నచ్చేయడంతో తన పాత్ర తీరు తెన్నులు ఆలోచించకుండా ఓకే చేశాడు నారా రోహిత్. కేవలం నటించడమే కాదు నిర్మాతగా కూడా ఓ చెయ్యి వేశాడు. సో ఇలాంటి అభిరుచి గల సినిమాల్లో నటించడమే కాదు నిర్మించి తన టేస్ట్ ఏంటో అందరికి తెలిసేలా చేశాడు రోహిత్.
రిలీజై వారం అవుతున్నా పోటీగా ఏ సినిమా లేకపోవడంతో రోజు రోజుకి అప్పట్లో మూవీకి కలక్షన్స్ పెరుగుతున్నాయట. మరి రోహిత్ కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమా మరిన్ని సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని ఆశిద్దాం.