సమంత స్టార్ అవుతుందని ముందే ఊహించాడట..!

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు సమంత యాడ్స్ చేస్తుండేది. అప్పుడు యాడ్ డైరక్టర్ మంచి క్రేజ్ ఉన్న గీతా కృష్ణ చేసిన ఓ యాడ్ లో సమంత నటించిందట.. చేసేది యాడ్ అయినా సరే ఆమెలోని టాలెంట్ గుర్తించినా డైరక్టర్ గీతా కృష్ణ హీరోయిన్ గా టర్న్ తీసుకోమని సమంతకు చెప్పాడట. అంతేకాదు భవిష్యత్ లో నువ్వు మంచి హీరోయిన్ అవుతావని అన్నాడట. మరి గీతా కృష్ణ నోటి వాక్కే ఏమాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది. 

త్వరలోనే అక్కినేని ఇంట పెద్ద కోడలిగా మరో భాధ్యతను మీద వేసుకుంటుంది. ఏది ఏమైనా ఆమెలోని టాలెంట్ గుర్తించిన గీతా కృష్ణకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే తను అవకాశాలు ఇవ్వకున్నా సరే ఆమె తనంతట తాను సినిమాల్లోకి వచ్చి సూపర్ సక్సెస్ అవడం గొప్ప విషయం. మరి టాలెంట్ ఉంటే ఎలాంటి వారికైనా లక్ తోడుంటుంది అని చెప్పాడానికి సమంత బెస్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు.  యాడ్ ఫిల్మ్ మేకర్ గా ఉన్న గీతా కృష్ణ కోకిల, కీచురాళ్ళు లాంటి సినిమాలు తీశారు కాని అంతగా సక్సెస్ అవ్వలేదు.