బ్రహ్మిని ఇరికించాలనే చిరు ప్లాన్

మెగాస్టార్ 150వ సినిమాలో బ్రహ్మానందం పాత్రను ముందు రాసుకోలేదట డైరక్టర్ వినాయక్. సినిమా సెట్స్ మీదకు వెళ్లే తరుణంలో చిరు పట్టుబట్టి మరి బ్రహ్మి క్యారక్టర్ రాయించాడట. అది కూడా బ్రహ్మి తనని ఇరికించేలా కాని.. నన్ను తను ఇరింకించేలా అయినా క్యారక్టర్ ఉండాలని అన్నాడట చిరు. అదేవిధంగా బ్రహ్మి క్యారక్టర్ డిజైన్ చేశారట. సినిమా మొత్తం సాటిస్ఫైడ్ గా వచ్చిందన్న వినాయక్ బ్రహ్మి క్యారక్టర్ పై జరిగిన డిస్కషన్ ను రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.   

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఖైది నంబర్ 150 మెగా అభిమానులకు మంచి ఫీస్ట్ ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తుంది. ఈమధ్యనే రిలీజ్ అయిన సాంగ్స్ కు కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా నిన్న రిలీజ్ అయిన నీరు నీరు సాంగ్ కు ప్రత్యేకమైన నీరాజనాలు అందుతున్నాయి. రైతు కష్టాలని పాట రూపంలో చూపించిన ఖైది యూనిట్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల దగ్గర నుండి రిలీజ్ కు ముందే మంచి స్పందన వస్తుంది.

మరి సినిమా రిలీజ్ తర్వాత ఇంకెంత హడావిడి ఉంటుందో చూడాలి. రిలీజ్ కు 4 రోజుల ముందు అంటే జనవరి 7న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. హాయ్ ల్యాండ్ లో జరుపుకునే ఈ ఈవెంట్ లో మెగా హీరోలంతా వస్తారని తెలుస్తుంది.