నిర్మాత గొడవపై వంశీ ఏమన్నాడంటే..!

సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా క్రేజ్ ఉన్న వంశీ పైడిపల్లి ఈమధ్య నిర్మాత పివిపితో వివాదంలో చిక్కుకున్నాడు. తనకు సినిమా చేసి పెడతానని ఇప్పుడు వేరే సినిమా కమిట్ అయ్యాడని వంశీ మీద నిర్మాతల మండలిలో కంప్లైంట్ కూడా ఇచ్చాడు పివిపి. అసలు ఇదంతా ఎలా వచ్చింది అంటే పివిపి బ్యానర్లో వంశీ పైడిపల్లి మహేష్ హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉంది. కాని మహేష్ మాత్రం దిల్ రాజు అశ్వనిదత్ ల ప్రొడక్షన్ లో అదే వంశీ డైరక్షన్లో మూవీ చేస్తున్నాడు.

దీనికి మహేష్ ను ఏమి అనని పివిపి వంశీని మాత్రం టార్గెట్ చేస్తున్నాడు. ఊపిరి సినిమా కూడా భారీ ఖర్చు పెట్టించాడని అది కూడా లాస్ తెచ్చిందని అంటున్నాడు. అయితే వంశీ పైడిపల్లి మాత్రం ఊపిరికి లాభాలొచ్చాయని.. తను ఏ సినిమా తీసినా పివిపి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కేసు లాంటివాటికి తాను భయపడేది లేదని వంసీ గట్టి రిప్లై ఇచ్చాడు. మరి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ సీరియస్ ఇష్యూ ఎవరు సాల్వ్ చేస్తారో చూడాలి.