మెగా ట్రెండ్ ఫాలో అవుతున్న నాని

మెగా హీరోలు ఈమధ్య ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమాలు ఆడియో డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేసి సినిమా రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి హిట్ కొట్టారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150 మూవీ ఖైది నంబర్ 150 కూడా ఇదే తరహా ప్రమోషన్స్ చేస్తున్నారు. 

అయితే మెగా ఫ్యామిలీ స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్ ను తాను ఫాలో అవుతా అంటున్నాడు నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం నాని నటిస్తున్న నేను లోకల్ సినిమా ఆడియో కూడా డైరెక్ట్ గా మార్కెట్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ క్రమంలో జనవరి 6న 'నెక్స్ట్ ఏంటి' అనే సాంగ్ రిలీజ్ చేయనున్నారట. సాంగ్ ప్రోమోగా వదులుతున్న ఈ సాంగ్ తో నేను లోకల్ మూవీ మీద ఓ అంచనా వేయొచ్చు. 

మరి ఇదే తరహాలో ఆడియో కూడా లేకుండా చేస్తారా అనది తెలియాల్సి ఉంది. సినిమా చూపిస్త మావ డైరక్టర్ నక్కిన త్రినాధ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.