
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల క్రేజ్ తో మహేష్ అటు ఫ్యాన్స్ పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ట్విట్టర్ లో 2 మినియన్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఆ లిస్ట్ లో కింగ్ నాగార్జున కూడా చేరాడు. ఈమధ్య వరుస సినిమాల సక్సెస్ లతో దూసుకుపోతున్న నాగ్ విలక్షణమైన పాత్రల్లో కూడా మెప్పిస్తున్నాడు.
ఓ పక్క తన తనయులిద్దరు హీరోలుగా దూసుకెళ్తున్నా నాగార్జున ఏమాత్రం తగ్గట్లేదు. ఏకంగా ట్విట్టర్ లో మహేష్ తర్వాత స్థానం సంపాదించాడంటే నాగ్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రేక్షకులకు మరోసారి భక్తి పరవశం కలిగించేందుకు ఓం నమో వెంకటేశాయగా రాబోతున్న నాగ్ మిగతా స్టార్ హీరోలకు చాలెంజ్ విసురుతున్నాడు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ లో కూడా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిని చూస్తే ఎస్.ఎస్.రాజమౌళి, ఆర్జివిలు కూడా ఉన్నారు.