
ఇప్పటిదాకా మెగాస్టార్ నటిస్తున్న 150వ సినిమా ఖైది నెంబర్ 150 మూవీలో ఊపొచ్చే సాంగ్స్ తోనే కేకపెట్టించిన చిత్రయూనిట్ సడెన్ గా సినిమా థీంతో కూడిన ఓ సాంగ్ ను రిలీజ్ చేసింది. నీరు.. నీరు.. నీరు.. అంటూ శంకర్ మహదేవన్ పాడిన ఈ సాంగ్ వింటే రైతు కష్టాలు కళ్ల ముందు రావాల్సిందే.. విన్నవారందరు కన్నీళ్లు పెట్టాల్సిందే. జోష్ ఫుల్ గా సినిమా మీద అంచనాలను పెంచేసిన ఖైది యూనిట్ ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ చేసి ఎమోషనల్ గా కూడా సినిమా టచ్ అయ్యేలా చేశారు.
సినిమా కథ రైతుల నీటి సమస్య మీదే అని తెలిసిందే. అయితే తెలుగులో ఈ పాటని ప్రత్యేకంగా పెట్టడం రామజోగయ్య శాస్త్రి ఎంతో అద్భుతంగా ఈ పాటని రాయడం అంతే అత్యద్బుతంగా దేవి మ్యూజిక్ అందించడం ఇలా అన్నిటికి అన్ని సరిగ్గా కుదిరాయి. కేవలం బిట్ సాంగ్ గా అనిపిస్తున్న ఈ సాంగ్ కరెక్ట్ సందర్భంలో పడితే మాత్రం సినిమా ఎక్కడికో వెళ్లినట్టే. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్న ఈ ఖైది నంబర్ 150 మూవీను వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. సాంగ్ విన్నవారు మాత్రం కాస్త ఎమోషనల్ అవ్వక తప్పదు. మరి ఈ మ్యాజిక్ థియేటర్ లో ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఈ పాటను రైతులందరికీ డెడికేట్ చేసింది ఖైది చిత్రయూనిట్.