ఏ డైరక్టర్ అయినా సరే తన సినిమా రిలీజ్ కు ముందు అంత హైప్ తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తాడు. కాని బాలయ్య వందవ సినిమా డైరక్టర్ క్రిష్ మాత్రం శాతకర్ణి సినిమాకు అనవసరమైన హడావిడి ఏం వద్దని అంటున్నాడట. ఇప్పటికే ట్రైలర్, టీజర్ సాంగ్స్ తో అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసిన క్రిష్ ఇప్పుడు హైప్ క్రియేట్ చేయొద్దని చిత్రయూనిట్ కు సలహా ఇస్తున్నాడట. జనవరి 12 రిలీజ్ డేట్ కన్ఫాం చేసిన క్రిష్ సినిమా పబ్లిసిటీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అయితే దీనికి కారణం లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన బాలకృష్ణ డిక్టేటర్ సినిమా కూడా కారణమని అంటున్నారు. శ్రీవాస్ డైరెక్ట్ చేసిన డిక్టేటర్ సినిమా రిలీజ్ ముందు బాగా హడావిడి చేశారు. అసలు బాలయ్య కెరియర్ లో ఇదో సూపర్ హిట్ సినిమా అవుతుంది అని రచ్చ రచ్చ చేశారు. తీరా సినిమా చూస్తే అంతగా ఏం లేదు. ఆ ఎఫెక్ట్ తో బాలయ్య సినిమా మీద అంచనాలు పెంచేస్తే సీన్ రివర్స్ అవుతుందని క్రిష్ శాతకర్ణి సినిమా గురించి ఎలాంటి హైప్ రాకుండా చూస్తున్నాడట.
ఇక సినిమా రిలీజ్ కు కేవలం 3 రోజుల ముందు మాత్రమే బాలకృష్ణ, శ్రీయలతో ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారట. సో మొత్తానికి క్రిష్ మంచి ప్లాన్ తోనే సినిమాను వదులుతున్నాడు. మరి సినిమా అంచనాలను అందుకుందా లేదా అన్నది తెలియాలంటే జనవరి 12 దాకా వెయిట్ చేయాల్సిందే.