
మెగాస్టార్ చిరంకీవి 9 ఏళ్ల తర్వాత నటిస్తున్న ఖైది నెంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ముందు జనవరి 4న విజయవాడలో అనుకున్నా అక్కడ ఈవెంట్ జరుపుకునేందుకు అనుమతి రాకపోవడంతో ఈ వేడుకని గుంటూర్ కు తరలిస్తున్నారట. విజయవాడ గుంటూర్ మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతుంది. ఇప్పటికే సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 4 నుండి 7కి షిఫ్ట్ చేశారట.
అంటే రిలీజ్ కు కేవలం 4 రోజులు ముందుగా ఈ ఈవెంట్ జరుగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ నుండే సినిమా పండుగ వాతారవరం తెచ్చేయాలని మెగా ప్లాన్ వేశారన్నమాట. సెన్సార్ నుండి కూడా సూపర్ అన్న టాక్ రావడంతో ఖైది యూనిట్ లో ఇప్పుడు మంచి జోష్ కబడుతుంది. ఓ పక్క పోటీగా బాలయ్య వందవ సినిమా శాతకర్ణి రిలీజ్ అవుతున్నా దానికి ఒక్కరోజు ముందు ఖైదిగా చిరు అదరగొట్టడం ఖాయమని అంటున్నారు అభిమానులు.
తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్న ఖైది నెంబర్ 150 సినిమా వినాయక్ డైరక్షన్లో రాం చరణ్ నిర్మాణంలో వస్తుంది. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.